పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బలూకిస్థాన్ నుంచి ఓ వార్త వెలువడుతోంది. పాకిస్థాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమికొట్టామని, క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.