పహల్గామ్ దాడి తర్వాత తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్ తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పాక్ మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాయాది దేశంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలను పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా పీవోకే లోని దట్టమైన అడవుల్లో ఈ కార్యకలాపాలు కనిపిస్తున్నాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెల్లడించింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పైక్ పై ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది. మే 7న పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన అనేక మంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, సిబ్బందిని చూపించే వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత సాయుధ దళాలు అంత్యక్రియలకు హాజరైన పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కీలక పోలీసు…
పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బలూకిస్థాన్ నుంచి ఓ వార్త వెలువడుతోంది. పాకిస్థాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమికొట్టామని, క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
Pakistan : ప్రత్యేక దేశం కోరుతూ పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో చాలా కాలంగా నిరంతర ప్రదర్శనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు నిరంతరం పాకిస్తాన్ సైన్యం నిరంకుశ ప్రవర్తనకు గురవుతున్నారు.