Babar Azam Creates History in T20s: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా వందకు పైగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (29) రికార్డుల్లో నిలిచాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌లోని క్లాన్‌టార్ఫ్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఫీట్ అందుకున్నాడు. ఐర్లాండ్‌పై 43 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 57 రన్స్ చేశాడు.
టీ20 ఫార్మాట్‌లో వందకు పైగా 50 ప్లస్ స్కోర్లు చేసిన నాలుగో క్రికెటర్‌గా బాబర్ ఆజమ్ నిలిచాడు. బాబర్ ఇప్పటివరకు ఆడిన 296 టీ20 మ్యాచ్‌ల్లో 89 అర్ధ సెంచరీలు, 11 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ అగ్ర స్థానంలో ఉంది. 377 మ్యాచ్‌లలో 8 సెంచరీలు, 102 అర్ధ శతకాలు బాదాడు. క్రిస్ గేల్ 463 మ్యాచ్‌లలో 22 సెంచరీలు, 88 అర్ధ శతకాలు చేశాడు. విరాట్ కోహ్లీ 388 మ్యాచ్‌లలో 9 సెంచరీలు, 96 అర్ధ శతకాలు బాదాడు. జోస్ బట్లర్ 413 మ్యాచ్‌లలో 8 సెంచరీలు, 80 అర్ధ శతకాలు చేశాడు.
Also Read: Rishabh Pant Ban: బిగ్ బ్రేకింగ్.. రిషబ్ పంత్‌పై సస్పెన్షన్!
ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సయీం ఆయుబ్ (45), బాబర్ ఆజమ్ (57), ఇఫ్తికర్ అహ్మద్ (37) రాణించారు. లక్ష్యాన్ని ఐర్లాండ్ మరో బంతి ఉండగా ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఆండ్రు బల్బిర్నీ(77), హ్యారీ టెక్టర్ (36) చెలరేగారు.