Baba Vanga : కళ్లతో చూడలేని బాబా వెంగా భవిష్యత్తును చూడగలడని అంటారు. ప్రస్తుతం ఆమె ప్రపంచంలో లేరు. కానీ ఆమె అనేక అంచనాలు రెండవ ప్రపంచ యుద్ధం సమయం నుండి చర్చలో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆమె సామాన్యుడిని కలవరపెట్టే అనేక అంచనాలను తెలిపారు. మొదటిది 2025 సంవత్సరం నుండి ప్రపంచం అంతం ప్రారంభమవుతుంది. కొంతకాలం తర్వాత భూమి, అంగారకుడి మధ్య యుద్ధం జరుగుతుందని కూడా చెప్పారు. 2025 సంవత్సరంలో యూరప్‌లో ఘర్షణలు జరుగుతాయని, దాని కారణంగా ఇక్కడ జనాభా తగ్గుతుందని బాబా వెంగా అంచనా వేస్తున్నారు. దీని తరువాత 2028 సంవత్సరంలో మానవులు వీనస్‌ను శక్తి వనరుగా అన్వేషించడం ప్రారంభించవచ్చు. పోలార్ ఐస్ క్యాప్స్ 2033లో కరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి. 2076లో ప్రపంచమంతటా కమ్యూనిజం వ్యాప్తి చెందుతుందని, 2130లో మానవులు గ్రహాంతరవాసులను సంప్రదించగలుగుతారని అంచనా వేశారు. 2170లో భూమిలో ఎక్కువ భాగం కరువుతో తుడిచిపెట్టుకుపోతుందని, 3005లో భూమి మార్టిన్ నాగరికతతో పోరాడుతుందని, 3797లో మానవులు భూమిని విడిచిపెట్టవలసి వస్తుందని చెప్పబడింది. 5079లో ప్రపంచం అంతం అవుతుంది. యువరాణి డయానా, 9/11 దాడులకు సంబంధించి బాబా వెంగా అంచనాలు నిజమని తేలింది. 1911లో జన్మించిన బాబా వెంగా 12 ఏళ్ల వయసులో చూపు కోల్పోయింది.