టాలీవుడ్ కు మరొక స్టార్ హీరోయిన్ తమ్ముడు ఎంట్రీ ఇస్తున్నాడు. జై లవకుశ, జెంటిల్ మెన్, 35 చిన్న కథ కాదు వంటి సినిమాలలో నటించి మెప్పించింది మళయాళి భామ నివేత థామస్. అక్క టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటే ఇప్పడు తమ్ముడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. నివేత థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ హీరోగా వెండితెరపై అలరించేందుకు వస్తున్నాడు.
Also Read : Akhanda2 : అఖండ 2 రిలీజ్ కు మూడు డేట్స్ పై కొసాగుతున్న సస్పెన్స్
నిఖిల్ థామస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బెంగళూరు మహానగరంలో బాలక’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. దర్శక ద్వయం మహి – రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను గమనిస్తే పవర్ స్టార్ పంజా ఫస్ట్ లుక్ రిలీజ్, సత్యం కంప్యూటర్స్, కొలవెరి డీ సాంగ్ ను హైలెట్ చేస్తూ బెంగళూరు నేపథ్యంలో జరిగే ఓ కుర్రాడి కథ అనేలా ఆకట్టుకునేలా రూపొందించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే మ్యాడ్, జాతిరత్నాలు వంటి కామెడీ ఎంటర్టైనర్స్ కు రచయితగా పనిచేసిన ప్రవీణ్ పట్టు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా విశ్వదీప్, సినిమాటోగ్రఫర్ గా మల్లు నాయక్ భాద్యతలు నిర్వరిస్తున్నారు. హరీష్ కోటా, వంశి కృష్ణ ఎడిటర్స్ గా పని చేస్తున్నారు. సయా క్రియేషన్స్, ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అఖిల్ యమ్మన్నగారి, Msn మూర్తి, Ch V శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ సార్ట్ చేయనున్న బెంగళూరు మహానగరంలో బాలక’ చిత్రానికి కిలారి సుబ్బారావు పీఆర్వోగా వ్యవహరిస్తుండగా, స్టార్ సర్కిల్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది.