మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ 100 ఏళ్ల సెంటినరీ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి తన బయోగ్రఫీ గురించి, ఎన్టీఆర్-ఏఎన్నార్ ల గురించి మాట్లాడారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకి లేదని చెప్పిన చిరు… “నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరి కి అప్పగిస్తున్నాను. సమకాలీన రచయితలలో యండమూరి కి సాటి లేరు, ఆయన రాసిన అభిలాష సినిమాతోనే పరిశ్రమలో నా స్థానం పదిలం అని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నా బయోగ్రఫీ రాసే సమయం నాకు ఉండదు అందుకే ఈ బాధ్యతని యండమూరికి అప్పగిస్తున్నాను” అని చెప్పాడు. ఎన్టీఆర్-ఏఎన్నార్ గురించి కూడా చిరు మాట్లాడుతూ… “ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాలాంటి వారికి దైవ సమానులు. వారితో కలిసి నటించడం నా పూర్వజన్మ సుకృతం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో అనుభవాలు మర్చిపోలేను…” అని ఆ మహానటులతో కలిసి నటించిన రోజులని గుర్తు చేసుకున్నాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే చిరు ప్రస్తుతానికి విశ్వంభర సినిమా చేస్తున్నాడు. బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫాంటసీ డ్రామాగా రూపొందుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి సినిమాల తర్వాత చిరు నుంచి వస్తున్న పూర్తిస్థాయి ఫాంటసీ డ్రామా విశ్వంభర. ఈ సినిమాతో చిరు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. గతంలో సైరా సినిమాతో చిరు పాన్ ఇండియా మార్కెట్ ముందుకి వచ్చాడు కానీ ఆశించిన స్థాయిలో సైరా సినిమా ఆడలేదు. మరి కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ విశ్వంభర సినిమాతో మాత్రం చిరు గురి తప్పకుండ హిట్ కొడతాడేమో చూడాలి.
Read Also: Salaar 2: ఊహించిన దానికన్నా ముందుకొచ్చిన ‘శౌర్యాంగ పర్వం’?