ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు వ్యక్తులు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నిజమాబాద్ జిల్లా కేంద్రంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలో రెండు ఏటిఎం లలో చోరికి యత్నించారు. యంత్రాలు తెరుచుకోకపోవడం తో దుండగులు తగులబెట్టారు. దీంతో రూ.50 లక్షల నగదు కాలి బూడిదైంది. వర్ని చౌరస్తా, వినాయక నగర్ లోని ఏటీఏంలను ధ్వంసం చేశారు. బైక్ పై ఇద్దరు దొంగలు ఏటీఏంలోకి చొరబడగా.. కారులో మరో ఇద్దరు రెక్కీ నిర్వహించారు. సీసీ కెమెరా లో దొంగల దృశ్యాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.