Kishan Reddy: నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వాజ్ పేయి..
- ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసం కార్యక్రమం
- పాల్గొన్న రాజ్యసభ ఎంపి సుధాన్ష్ త్రివేది, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, విద్యాసాగర్ రావు
- వాజ్ పేయి స్ఫూర్తితో ఈ దేశ యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉంది- కిషన్ రెడ్డి
- వాజ్ పేయిని చాలా దగ్గర నుంచి చూశాను- కిషన్ రెడ్డి.
ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపి సభ్యులు సుధాన్ష్ త్రివేది హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వాజ్ పేయి స్ఫూర్తితో ఈ దేశ యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాజ్ పేయి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే వరకు బాగోగులు చూసుకునే అదృష్టం తనకు దక్కిందని అన్నారు. వాజ్ పేయిని చాలా దగ్గర నుంచి చూశానని కిషన్ రెడ్డి చెప్పారు.
Read Also: America: క్రిస్మస్ వేళ అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. అన్ని విమానాలు రద్దు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు వాజ్ పేయి వచ్చారు.. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు యువ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఉన్నానని కిషన్ రెడ్డి చెప్పారు. యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ప్రధాని వాజ్ పేయ్‌ని అనేకసార్లు కలిశానని పేర్కొన్నారు. వాజ్ పేయి ఉపన్యాసం కవితాత్మకంగా ఉండేదని తెలిపారు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వాజ్ పేయి అని కిషన్ రెడ్డి తెలిపారు. నైతిక విలువలకు కట్టుబడిన వాజ్ పేయి ఒక్క ఓటుతో ప్రధాని పదవిని కోల్పోయారు.. అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్ పేయి అన్నారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ పెరిగిందని కిషన్ రెడ్డి చెప్పారు.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
వాజ్ పేయి జాతీయ రహదారుల రూపకల్పన చేశారు.. వాజ్ పేయ్ స్ఫూర్తితో అమెరికా రోడ్లను తలదన్నేలా మోడీ అభివృద్ది చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. చిన్న రాష్ట్రాల ద్వారా వేగవంతమైన అభివృద్ది జరుగుతుందని విశ్వసించారు.. అందరి ఆమోదయోగ్యంతో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారన్నారు. వాజ్ పేయి ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణించిన ఏకైక ప్రధాని వాజ్ పేయి అని.. తన జీవితాన్ని జాతీయ భావ సిద్ధాంతానికి అంకితం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Wipro Buyback: విప్రో ఇన్వెస్టర్లకు కాసుల పండగే.. రూ.15 వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన ఐటీ దిగ్గజం
-
Yuvraj Singh: అభిషేక్ శర్మతో పాటు.. అతడు కూడా యువరాజ్ సింగ్ శిష్యుడే.. ఓపెనింగ్‌లో దబిడిదిబిడే..
-
Medigadda : మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కారు నజర్.. 20న సీఎం రేవంత్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ పర్యటన.!
-
Gold vs Stocks: “గోల్డ్ కంటే ‘స్మార్ట్’గా పెరిగిన స్టాక్స్ ఇవే! ఈ రెండు షేర్లు కొన్నవారికి కాసుల వర్షం”
-
Rahul Gandhi: ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, బీజేపీ అధికారాన్ని శాశ్వతం చేసే బిల్లు..
ట్రెండింగ్
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!
-
T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!
-
Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!