బీఫ్‌ను నిషేధించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా తనకు లేఖ రాస్తే నిషేధించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. ముస్లింల ప్రాబల్యం ఉన్న సంగూరి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీఫ్ పంపిణీ చేశారంటూ బీజేపీ నేతపై వచ్చిన ఆరోపణపై శర్మ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఈ అంశాన్ని లేవనెత్తినందుకు సంతోషంగా ఉందన్నారు.
రైలులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడిపై కొందరు యువకులు చితకబాదారు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్‌లోని ఇగత్‌పురి సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వృద్ధుడు రైలులో ప్రయాణిస్తుండగా.., అతను బీఫ్ మటన్ తీసుకెళుతున్నాడనే అనుమానంతో కొందరు యువకులు దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.