Maoist Hidma: నిన్న(మంగళవారం) ఏపీ పోలీసుల చేతిలో హతమైన హిడ్మా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా లొంగిపోయే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్‌లో ఉన్న ఒక జర్నలిస్ట్‌కు హిడ్మా లేఖ రాశారు. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని నవంబర్ 10న జర్నలిస్ట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. “ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉంది.. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం.. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతాం.. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాల పై చర్చించాల్సి ఉంది..” అని లేఖలో రాసుకొచ్చాడు.
READ MORE: Aishwarya Rajesh : హిట్ కొట్టినా.. పర్ఫామెన్స్ బాగా చేసిన కూడా సినిమాలు రావట్లేదు.. కారణం ఏంటి?
ఇదిలా ఉండగా.. ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నిన్న(మంగళవారం) ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా మృతిచెందిన విషయం తెలిసిందే. హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ, మరో నలుగురు మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించారు. ఈమేరకు హిడ్మా, రాజే మరణించిన విషయాన్ని పోలీసులు నిర్ధారిస్తూ వారి మృతదేహాల ఫొటోలను రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలకు సంబంధించి కచ్చితమైన సమాచారంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఈరోజు ఉదయం కూంబింగ్ చేపట్టాయని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు.
READ MORE: Story Board: జూబ్లీహిల్స్ గెలుపుతో సర్కార్ లో జోష్.. పంచాయతీ ఎన్నికలకు కసరత్తు..