పూణే బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన పెళ్లి విషయం పై నేరుగా, ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్ అయిపోయింది. ఇప్పటి వరకు తన వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా మాట్లాడని భాగ్యశ్రీ, ఈసారి మాత్రం ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ అండ్ క్లియర్ ఆన్సర్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటర్వ్యూలో యాంకర్ “లవ్ మ్యారేజ్ చేస్తావా? లేక అరేంజ్ మ్యారేజ్?” అని ప్రశ్నించగా, భాగ్యశ్రీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా “లవ్ మ్యారేజ్ చేసుకుంటా” అని స్పష్టంగా చెప్పింది.
Also Read : Rishab Shetty : రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’ షూటింగ్ అప్‌డేట్ !
అదే సమయంలో యాంకర్ అడిగిన మరో ప్రశ్న .. “అయితే ప్రస్తుతం ఎవరైనా లవ్‌లో ఉన్నారా?” కి ఆమె సింపుల్‌గా “ప్రస్తుతం లవ్‌లో లేను” అని సమాధానమిచ్చింది. దాంతో యాంకర్ మళ్లీ కౌంటర్‌గా “లవ్‌లో లేకపోయినా లవ్ మ్యారేజ్ చేస్తానని ఎలా చెప్తున్నారు?” అని అడగ్గా, భాగ్యశ్రీ ఇచ్చిన రిప్లై మాత్రం చాలామందిని ఆకట్టుకుంది. “నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. ఎప్పటికైనా నాకు నచ్చే, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి నా జీవితంలోకి తప్పకుండా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ నేను మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటా ఇది ఫిక్స్” అని ఆమె చెప్పింది. ప్రస్తుతం భాగ్యశ్రీ రామ్‌తో కలిసి నటించిన ‘ఆంధ్రకింగ్’ ఈ నెల 27న విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చెప్పిన పెళ్లి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ సరసన ఫ్రెష్ పెయిర్‌గా కనిపిస్తున్న భాగ్యశ్రీ, ఈ సినిమాతో మంచి మార్క్ క్రియేట్ అవ్వాలని ఆశ పడుతోంది.