Ind vs Pak: మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్..! పాకిస్థాన్ మరోసారి బహిష్కరణ నాటకం ఆడనుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Pak: ఆసియా కప్ 2025లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పుడు తన మొదటి సూపర్ 4 దశ మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తాజాగా ఈ మ్యాచ్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉంటారని వర్గాలు సూచిస్తున్నాయి. మునుపటి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో కూడా ఈయనే రిఫరీగా ఉన్నారు.
READ MORE: Duddilla Sridhar Babu : ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఎక్కడ.?
Also Read
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
గత భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో సైతం పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ప్లేయర్స్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఈ వివాదంపై పైక్రాఫ్ట్‌ను బాధ్యుణ్ని చేస్తూ.. ఐసీసీకి రెండు ఫిర్యాదు లేఖలు పంపింది. మొదటి మెయిల్‌లో అతణ్ని రిఫరీగా టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. రెండో లేఖలో పైక్రాఫ్ట్‌ను కనీసం పాక్ మ్యాచ్‌లకైనా దూరం పెట్టాలని అభ్యర్థించింది. అయితే.. పీసీబీ డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించింది. కాగా.. గత యూఏఈ-పాకిస్థాన్ మ్యాచ్‌లో సైతం పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. మ్యాచ్‌కు ముందు ఆండీ పైక్రాఫ్ట్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చాలా వివాదం సృష్టించింది. మ్యాచ్ ప్రారంభం అయినప్పటికీ జట్టు గ్రౌండ్‌లోకి రాలేదు.
ICC, PCB, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత.. గంట సమయం వేస్ట్‌చేసిన పాక్ జట్టు చివరికి మ్యాచ్‌ను విజయంతో ముగించింది. కాగా.. ఈసారి గతసారి వివాదం చెలరేగిన స్టేడియంలోనే భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఇరు దేశాల మధ్య జరిగే ఈ మ్యాచ్ ఎప్పుడూ హై-వోల్టేజ్ వ్యవహారం. అయితే.. ఆండీ పైక్రాఫ్ట్‌ను నియమించడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి మ్యాచ్‌ను బహిష్కరిస్తామని నాటకాలు ఆడనుందా? లేదా భారత్‌తో ఎలాంటి వివాదాలు లేకుండా మ్యాచ్‌ను ముగిస్తుందా? అని వేచి చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!