కేంద్ర బడ్జెట్ 2023-24 పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఆయన వెంట బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2027 వరకు ఇండియాని నెంబర్ వన్ గా చేసే బడ్జెట్ ఇది ఆయన అన్నారు. 2014 నుంచి రూరల్ ఫ్యామిలీస్.. రైతులకు మేలు చేకూరేలాగా అనేక కార్యక్రమాలు కేంద్రం తెచ్చిందని, మేజర్ గ్రోవింగ్ కంట్రీలో ఇండియా ముందుందన్నారు. అంతేకాకుండా.. ‘బడ్జెట్ చూసి కేవలం నెంబర్స్ మాత్రమే కానీ.. చేసి చూపించలేరు అని ప్రతిపక్షం అంటుంది.. గతంలో చెప్పినవి అన్ని చేసి చూపించాం.. 2014కి ముందు రోజుకు 4కిలోమీటర్ల రోడ్స్ నిర్మిస్తే.. 2014 తరువాత రోజుకు 12కిలోమీటర్ల రోడ్స్ నిర్మిస్తున్నాం.. 40% ఎనర్జీ అనేది గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వస్తుంది.. పేద కుటుంబాలకు మోడీజీ అండగా ఉంటున్నారు.. పేదలు లేకుండా ఇండియా కనిపించబోతుంది.. పెద్ద కంట్రీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం.. తక్కువ గ్రోత్ ఉంది.. ఇండియాలో ఎకానమీ గ్రోత్ స్పీడ్ గా ఉంది..
Also Read : V.Hanumantha Rao : మోడీ ప్రధాని అయ్యాక.. సామాన్యులకు ఒరిగింది ఏమి లేదు
ప్రస్తుతం టాప్ ఎకానమీ గ్రోత్ ఉన్న దేశాల్లో లో ఐదవ ప్లేస్ లో ఇండియా ఉంది.. అది టాప్ త్రి ప్లేస్ లోకి రాబోతుంది.. తెలంగాణ ప్రజలు మంచి చదువు.. మంచి వ్యక్తిత్వం ఉన్నారు.. మోడీజీ ఎలా ఎకానమీని గ్రోత్ చేయగలుగుతున్నారో అని అందరూ చర్చించుకుంటున్నారు..’ అని ఆయన అన్నారు. ‘రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్ట్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి.. హైదరాబాద్ ఐటీ హబ్ గా ఉంది.. మరో మూడు వందే భారత్ ట్రైన్స్ తెలంగాణలో నడపడానికి రూట్స్ పరిశీలిస్తున్నాం.. దగ్గరగా ఉన్న రెండు ప్రాంతాలకు నడపడానికి వందే మెట్రో రైల్ ని తీసుకురాబోతున్నాం..
Also Read : Revanth Reddy : 2003 నాటి పరిస్థితులు.. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది
ఇప్పటికే డిజైన్ వర్క్ స్టార్ట్ చేసాం.. మరికొన్ని రోజుల్లో ట్రైన్స్ అందుబాటులోకి వస్తాయి.. మరో మూడు నాలుగేళ్లలో మన రైళ్లని ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం.. ఉపాధి.. అభివృద్ధి కోసమే మోడీ ప్రతి పాలసీని తీసుకువస్తున్నారు.. కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.. మోడీజీ వాటిని పట్టించుకోరు.. ప్రజల కోసం.. దేశం కోసం పని చేస్తున్నారు.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పై వర్క్ నడుస్తుంది.. 150 ఎకరాలను స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్..’ అని ఆయన అన్నారు.