మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత సామాన్యుడిలా రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయనగరం రైలులో ప్రయాణించుటకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ అరుగు మీద కూర్చున్నారు. గతంలో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు రాజకుటుంబానికి చెందినవారు. అయితే సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన.. ఒక సామాన్య ప్రయాణికుడిలా రైల్వే స్టేషన్‌లో కనిపించారు.…