Swati Maliwal Case: కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై భౌతికదాడిలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శ బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో శనివారం అతన్ని అరెస్ట్ చేశారు. సోమవారం (13-05-2024) కేజ్రీవాల్ ఇంట్లో స్వాతి మాలివాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేశారు. నాలుగు రోజుల తర్వాత అనగా.. గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మాలివాల్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: TeamIndia: ఆ రోజునే న్యూయార్క్ బయలుదేరునున్న టీమిండియా ఆటగాళ్లు..
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
బిభవ్ కుమార్‌ను ముఖ్యమంత్రి నివాసం నుంచి ఢిల్లీ పోలీస్ బృందం మధ్యాహ్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. విచారణ నిమిత్తం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి సహకారం అందిస్తామని అధికారులకు ఈ మెయిల్ పంపినప్పటికీ పోలీసుల నుంచి తమకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని బిభవ్ కుమార్ తరపు న్యాయవాది కరణ్ శర్మ తెలిపారు.
ఇది కూడా చదవండి: Police Station Fire: మైనర్ భార్య, భర్త పోలీస్ కస్టడీలో మృతి.. పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టిన జనం..
సోమవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి మాలివాల్… సీఎం నివాసానికి వచ్చింది. సిబ్బంది డ్రాయింగ్ రూమ్‌లో వెయిట్ చేయమని చెప్పడంతో కేజ్రీవాల్ రాక కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో ఆకస్మాత్తుగా బిభవ్ కుమార్ రావడం.. పెద్దగా అరుపులు అరవడం.. దుర్భాషలాడారు. ఈ హఠాత్తు పరిణామంతో ఆమె షాక్‌కు గురైంది. అంతే మెరుపు వేగంతో స్వాతి మాలివాల్‌పై దాడికి తెగబడ్డారు. తను రుతుక్రమంలో ఉన్నానని బతిమాలినా పట్టించుకోకుండా దాడి చేశాడు. సాయం చేయమని వేడుకున్నా.. సిబ్బంది చూస్తూనే ఉన్నారు కానీ.. ఎవరు రక్షించే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి ఎలాగోలా బయటపడి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేలోపే స్వాతి మాలివాల్‌ను సిబ్బంది బయటకు పంపేశారు. తాజాగా విడుదలైన వీడియోలో ఈ దృశ్యాలు కనిపించాయి.
స్వాతి మాలివాల్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో బిభవ్ కుమార్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎక్కడెక్కడ దాడి చేశాడో అవన్నీ ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అలాగే మెడికల్ రిపోర్టులో కూడా ఆమెపై దాడి జరిగినట్లుగా తేలింది. శనివారం మధ్యాహ్నం బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు విచారించనున్నారు. ఇక జాతీయ మహిళా కమిషన్ రెండు సార్లు నోటీసులు ఇచ్చింది. కానీ బిభవ్ కుమార్ స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD : బుజ్జికి వాయిస్ ఓవర్ అందించిన ఆ స్టార్ హీరోయిన్..?
మరోవైపు ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కేజ్రీవాల్ స్పందించకపోవడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్‌లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!