బీహార్లోని అరారియా జిల్లాలోని తారాబరి గ్రామంలో ఒక వ్యక్తి, అతని మైనర్ ‘భార్య’ పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసి నిప్పంటించారు ప్రజలు. ఆ వ్యక్తి ఏడాది క్రితం తన భార్యను కోల్పోయాడు. అతను రెండు రోజుల క్రితం తన దివంగత భార్య 14 ఏళ్ల సోదరిని వివాహం చేసుకున్నాడు. కాని., వారిని గురువారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: RCB vs CSK: బెంగళూరు, చెన్నై కీలక మ్యాచ్.. చిన్నస్వామిలో వాతావరణ పరిస్థితి ఎలా ఉందంటే?
నిజానికి భారతదేశంలో మహిళలు వివాహం చేసుకోవడానికి చట్టబద్ధమైన వయస్సు 18. దీనితో వివాహం జరిగిన వెంటనే ఆ వ్యక్తిని, అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కొట్టడంతో వారు కస్టడీలోనే మరణించారని ఆరోపించారు. పోలీసు లాకప్ ఒక సీసీటీవీ వీడియోలో., వ్యక్తి లాకప్ తలుపు పైకి ఎక్కి వస్త్రంతో ఉరి వేసుకోవడం కనిపిస్తుంది. వీరిద్దరి మరణ వార్త ఆ ప్రాంతంలో వ్యాపించడంతో, ఆగ్రహించిన గ్రామస్తులు తారాబరి పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టారు. ఆ తర్వాత పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వారు.
ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసి, ఆ తరువాత దానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కనీసం ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సదర్ ఎస్డీపీఓ రాంపుకర్ సింగ్ సహా పలు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. అయితే, ఆగ్రహించిన గ్రామస్తులు నిరసనను కొనసాగించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కస్టడీలో ఉన్న దంపతులు చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు.