ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్‌కు ఐదు రోజుల ముందు ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల టిక్కెట్లను పార్టీ రద్దు చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు రాజేష్ రిషి, నరేష్ యాదవ్, రోహిత్ కుమార్ మెహ్రాలియా శుక్రవారం రాజీనామా చేశారు.
Arvind Kejriwal: మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్ బీజేపీలో చేరడంపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు (సోమవారం) మాట్లాడుతూ.. గహ్లోట్ తన స్వంత నిర్ణయాలు తీసుకోగలరు.. అతను స్వేచ్ఛగా ఉన్నాడు.. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లవచ్చని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. లిక్కర్ కేసులో తీహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదలైన తర్వాత హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కేజ్రీవాల్ కలిసి రాజీనామా సమర్పించనున్నారు.
Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ పిటిషన్‌పై జూలై 17వ తేదీన విచారణ జరగనుంది.
విపక్ష ఇండియా కూటమి జూన్ 1వ తేదీన ఢిల్లీలో సమావేశం కాబోతుంది. ఈ మీటింగ్‌కు రావాల్సిందిగా కూటమిలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
ఇవాళ (శనివారం) దక్షిణ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షో చేయనున్నారు. ఆ రోడ్ షోలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో జరిగిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు తెలిపింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ కొన్ని నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలేయం, ఊపిరితిత్తులు, గుండెకు చికిత్స పొందుతూ క్రమంగా మరణించే అవకాశం ఉందన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దగ్గర పని చేస్తున్న పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేస్తుంది. సుమారు 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.