Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 గంటలకు గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాని మోడీ సహా పలువురు జాతీయ నేతలు హాజరుకానుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల కోసం నియమించిన ఐదుగురు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు బాబు.ఏ, హరి జవహర్ లాల్, కన్నబాబు, సీహెచ్ హరికిరణ్, వీర పాండియన్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 14 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలకు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, ఇతరుల కోసం మూడు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: Central Ministers: బీజేపీ నాయకత్వ మార్పులు మరియు కొత్త బాధ్యతలు ఎవరెవరికి..?
Also Read
వర్షం పడినా ప్రమాణ స్వీకారానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సభాప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను పెడుతున్నారు. విమానాశ్రయం ఎదురుగానే వేదిక ఉండడంతో వీఐపీల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని భావిస్తున్నారు. విమానాశ్రయానికి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక వచ్చేందుకు ప్రధాని, కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖుల రాక కోసం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రహారిని ఆనుకుని ఉన్న కేసరిపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో వీవీఐపీల వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చే కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం విజయవాడ నగరంలోని ప్రముఖ హోటల్స్‌లో గదులను ప్రభుత్వం ఇప్పటికే బుక్ చేసింది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. . అతిథులుగా వచ్చిన వారికి, సభాస్థలికి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
తాజావార్తలు
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్‌పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!