AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIDWA: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను అందించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని సివిల్ సప్లై కార్యాలయం ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆర్. అరుణజ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లు లక్ష్మి మాట్లాడుతూ, 2014 ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, పాఠశాల ఫీజులు నిరంతరం పెరుగుతున్నాయని, దీంతో సామాన్య ప్రజల జీవనం మరింత భారంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల కారణంగా కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1 కోటి 5 లక్షల 42 వేల 188 బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్నాయని, వాటి పరిధిలో 3 కోట్ల 39 లక్షల 96 వేల 239 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం మాత్రమే అందిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read
ప్రజల ఆహార భద్రతను బలోపేతం చేయాలంటే బియ్యంతో పాటు పప్పులు, వంటనూనెలు, మొక్కజొన్నలు, చక్కెర, కారం, పసుపు, జీలకర్ర, పామాయిల్, కొబ్బరి నూనె, ఆవాలు, జొన్నలు, పల్లీలు, సబ్బులు వంటి మొత్తం 14 రకాల నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల అనేక కుటుంబాలు పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నాయని, ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య అధికమవుతోందని మల్లు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. సరైన పోషకాహారం అందక చిన్నారులు కూడా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆశలత, కె. నాగలక్ష్మి, పి. శశికళ, వై. వరలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బట్టుపల్లి అనూరాధతో పాటు లక్ష్మమ్మ, సృజన, నవీన, షాబానా బేగం, మస్తాన్ బీ, ఎం. అరుణ, సంధ్య, ఇందిర, వెంకటమ్మ, కవిత, భవాని తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!