POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
- పీఓకే రక్తపాతంపై స్పందించిన భారత్..
- పాక్ అకృత్యాలకు జవాబుదారీగా ఉంచాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, పాకిస్తాన్‌ను తాను చేస్తున్న దుర్మార్గాలకు అంతర్జాతీయ సమాజం ముందు జవాబుదారీగా నిలబెట్టాలని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయని ఆరోపించారు. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ఇలాంటి ప్రచారానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. పాక్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.
ఇటీవల పీఓకేలోని రావల్కోట్లో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పాక్ ప్రభుత్వం, ఆర్మీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అయితే, వీటిని పాక్ ఆర్మీ అణిచివేసే ప్రయత్నాలు చేసింది. నిరసనకారులు, భద్రతా బలగాలకు మధ్య హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించగా, 200కి పైగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను బట్టి చూస్తే మృతుల సంఖ్య వందల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. పీఓకే ప్రజలు తుపాకులు, పెట్రోల్ బాంబులతో తమపై దాడులు చేస్తున్నారని పాక్ భద్రతా బలగాలు ఆరోపిస్తున్నాయి.
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
పీఓకే ప్రజల్ని పాక్ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం, పీఓకే వనరుల్ని పంజాబ్ తరలించడం, పీఓకే ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీలు మోపడం వంటివి చేస్తోంది. దీంతో ఈ అణిచివేత, అక్రమాలపై పీఓకే ప్రజలు తిరగబడుతున్నారు. తమకు స్వాతంత్య్రం కావాలని నినదిస్తున్నారు. మరోవైపు, ఈ అల్లర్లు పీఓకేలోని మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిట్ బాల్టిస్తాన్, దద్యాల్, రావల్కోట్, సుధ్నోటి, తట్టాపాని ప్రాంతాలకు విస్తరించాయి. మొబైల్ ఇంటర్నెట్ను పాక్ ప్రభుత్వం నిలిపేసింది. ఈ దమణకాండపై బ్రిటిష్ ఎంపీలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?