Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush – Siruthai Siva: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, స్టార్ హీరో ధనుష్‌కు సంబంధించిన ఒక సంచలన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. మాస్ కమర్షియల్ చిత్రాల డైరెక్టర్ ‘సిరుతై’ శివ చెప్పిన ఒక క్రేజీ లైన్‌కు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టి టాక్ వినిపిస్తోంది. ఆ కథ విని ధనుష్ ఫిదా అయినట్లు సమాచారం. ఇటీవల డైరెక్టర్ సిరుతై శివ ధనుష్‌ను కలిసి ఒక పక్కా రూరల్ నేపథ్యం ఉన్న మాస్ కథను వినిపించారట. ఈ స్క్రిప్ట్‌లోని కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలివేషన్స్ ధనుష్‌ను విపరీతంగా ఆకట్టుకున్నట్లు సమాచారం. కథ విన్న వెంటనే ధనుష్ ఎంతో ఇంప్రెస్ అయ్యారని, ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఫిక్స్ అయినట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం ధనుష్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు, కమిట్మెంట్లు ఉన్నాయి. అవి పూర్తి కావడానికి కొంత సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో శివతో చేయబోయే ఈ సినిమా కథ మరెవరికీ ఇవ్వద్దని, తన కోసమే హోల్డ్‌లో పెట్టాల్సిందిగా ధనుష్ కోరినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. తన ప్రస్తుత కమిట్మెంట్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాత, ఈ సినిమా కోసం జనవరి 2027 నుంచి డేట్స్ కేటాయించేందుకు ధనుష్ అంగీకరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ధనుష్ – సిరుతై శివ కాంబినేషన్లో రాబోయే ఈ హై – వోల్టేజ్ మాస్ రూరల్ ఎంటర్టైనర్ను టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుందనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై అటు డైరెక్టర్ నుంచి గానీ హీరో నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా నటనతో మెప్పించే ధనుష్, మరి సిరుతై శివ మార్క్ రూరల్ మాస్ ఎంటర్టైనర్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!