క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ కుమారుడు అర్జున్ టెండ్యూలర్‌కు ఇటీవల ఎంగేజ్‌మెంట్ అయిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు సానియా చందోక్‌తో అతడికి నిశ్చితార్థం అయింది. త్వరలోనే అర్జున్, సానియాలు వివాహం చేసుకోనున్నారు. అయితే ఎంగేజ్‌మెంట్ తర్వాత తొలి మ్యాచ్‌ను ఆడిన అర్జున్.. అద్భుత బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో ఏకంగా ఐదు వికెట్స్ పడగొట్టిన అర్జున్.. బ్యాటింగ్‌లో 36 రన్స్ బాదాడు.
Also Read: Karishma Sharma : రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసిన స్టార్ హీరోయిన్.. తీవ్ర గాయాలు
ప్రస్తుతం కర్ణాటక క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ కె.తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో గోవా జట్టుకు అర్జున్ టెండ్యూలర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు చెలరేగిపోయాడు. తాను వేసిన మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. మొత్తంగా ఐదు వికెట్స్ తీశాడు. అర్జున్ దెబ్బకు మహారాష్ట్ర 136 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 44 బంతుల్లో 36 పరుగులు చేశాడు. గోవా తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసింది. గోవాకు 197 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌ఆడుతోంది.