Karishma Sharma : బాలీవుడ్ హీరోయిన్ ట్రైన్ నుంచి దూకేసింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కాస్త సీరియస్ గానే ఉంది. ఆమె ఎవరో కాదు కరిష్మా శర్మ. బుధవారం ఉదయం ఆమె రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసింది. దీంతో తలకు, స్పైన్ కు బలమైన దెబ్బలు తాకడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ కావడంతో ఆమెకు బలమైన గాయాలు అయ్యాయి. కోలుకోవడానికి చాలా టైమ్ పట్టేలా కనిపిస్తోంది. ఈ ఘటనపై తాజాగా ఆమె ఇన్ స్టాలో పోస్టు కూడా పెట్టింది. నేను సినిమా షూటింగ్ కోసం చర్చ్ గేట్ కు వెళ్దామని అనుకున్నాను. ట్రాఫిక్ లో లేట్ అవుతుందేమో అని ట్రైన్ లో వెళ్దాం అనుకున్నా.
Read Also : Tamannah : అతన్నే పెళ్లి చేసుకుంటా.. తమన్నా షాకింగ్ ఆన్సర్
స్టేషన్ కు వెళ్లి ట్రైన్ ఎక్కాను. కానీ నా ఫ్రెండ్స్ ఇంకా రాలేదని గమనించి.. సడెన్ గా ట్రైన్ నుంచి దూకేశాను. నేను చీర కట్టుకుని ఉండటం వల్ల కాళ్లకు తట్టుకుని కింద పడిపోయాను. తలకు, స్పైన్ కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాను. నన్ను అభిమానించే వారి ప్రేమనే కాపాడుతోంది. కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్లు. ప్రస్తుతానికి అబ్జర్వేషన్ లో ఉంచారు. ఇప్పటికి అయితే ఎలాంటి ప్రమాదం లేదు అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ. ఆమె చేసిన ఈ పోస్టుతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అయితే హీరోయిన్ అయి ఉండి ట్రైన్ లో వెళ్లడం ఏంటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Krithi Shetty : బాబోయ్.. కృతిశెట్టి పరువాల మంటలు