గత రాత్రి పోలీసులకు మంచు మనోజ్ కు వాగ్వాదం చోటు చేసుకుంది. పెట్రోలింగ్ లో భాగంగా భాకరపేట సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ తనిఖీ కి వెళ్ళిన ఎస్ ఐ తో మనోజ్ గొడవ పడ్డారు. అయితే రాత్రి జరిగిన ఘటనపై వీడియో రిలీజ్ చేసాడు మంచు మనోజ్. మనోజ్ మాట్లాడుతూ ‘తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు. తాను చట్టానికి లోబడే పోలీసులకు సహకరించాను. పోలీసులు వచ్చి నాపై దురుసు గా వ్యవహరించారు. సీఎం దగ్గర నుంచి వచ్చానని చెప్పి ముందుగా భయపెట్టించే ప్రయత్నం చేశారు. సీఎం గారి పేరు ఎందుకు చెప్తున్నారని పోలీసులను నిలదీశాను. సీఎం గారి బందోబస్తు చూసుకొని వస్తున్నామని మళ్లీ మాట మార్చారు.
సైరన్ వేసుకుని వచ్చి రిసార్ట్ లో పోలీసుల హంగామా చేశారు. నేను నా కారులో పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగాను. దానికి ఎస్ఐ ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చివరికి సిఐకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాను. నా దగ్గర మొత్తం అన్ని రికార్డులు ఉన్నాయి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. యూనివర్సిటీ ముందు ఉన్న నా వాళ్ల కోసం నేను పోరాటం చేస్తున్నాను. విద్యార్థులకు న్యాయం చేయమని పోరాటం చేస్తున్నాను. నా వాళ్లపైన దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏమి చేయట్లేదు. నాపై కావాలని లేనిపోనీవి కల్పించి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు’ అని అన్నారు.
Also Read : Kollywood : సీక్వెల్స్ తో సేఫ్ గేమ్ ఆడుతున్న కోలీవుడ్ హీరోలు