కోలీవుడ్ లో ఒకరిని చూసి ఒకరు సీక్వెల్ ప్రాజెక్ట్ లు స్టార్ట్ చేస్తున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా ఈసారి తంబీల సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉంది. తమిళ హీరోలు హిట్ కొడితే చాలు అన్నట్లుగా ఉన్నారు. గతేడాది సరైన సక్సెస్ లేని హీరోలైతే తమ పాత హిట్ లకు సీక్వెల్స్ తెచ్చే పనిలో పడ్డారు. ఇంకొందరు అప్పటివరకు ఏం వెయిట్ చేస్తామని చెప్పి ఒకటి రెండు సినిమాల తర్వాత సీక్వెల్స్ షురూ చేస్తున్నారు. శివ కార్తికేయన్ నటించిన రీసెంట్ చిత్రం “అమరన్”తో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read : MouniRoy : బికినీలో మౌని రాయ్.. మాములుగా లేదోయ్..
తాజాగా శివకార్తికేయన్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో ‘మదరాసి’ సినిమా ప్రకటించాడు. ఇది గతంలో మురుగదాస్ డైరెక్ట్ చేసిన తుపాకీ ఫిలింకు సీక్వెల్ అని చెన్నై వర్గాల టాక్. ఇక రజనీకాంత్ కు జైలర్ తర్వాత లాల్ సలామ్ ,వెట్టియాన్ రూపంలో రెండు ఫ్లోప్స్ పలకరించాయి. దీంతో ఎలాగైనా హిట్ ఇవ్వలని జైలర్ 2ను మొదలుపెట్టాడు. ఇక మరొక యంగ్ హీరో కార్తీ ఏకగన్ రెండు సీక్వెల్స్ ను తీసుకురానున్నాడు. ఖైదీ తర్వాత ఆ స్థాయి హిట్ ను మళ్ళీ అందుకోలేని కార్తీ దీనికి సీక్వెల్ గా ఖైదీ -2 ను తీసుకురాబోతున్నాడు. అలాగే కార్తీ మరో హిట్ సర్దార్ కు సీక్వెల్ గా సర్దార్ -2 ను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు కార్తీ. అలాగే చాలా కాలంగ హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవి మోహన్ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఆయినటువంటి తనివరువన్ కు సీక్వెల్ గా తనివరువన్ 2 ను చర్చల దశలో ఉంది. ఇలా కోలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు సీక్వెల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.