మారుతున్న సమాజానికి అనుగుణంగా రోజు రోజుకూ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లతో పాటు.. స్మార్ట్‌వాచ్‌ల హవా నడుస్తోంది. కంపెనీలను బట్టి స్మార్ట్ వాచ్ లు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో లభిస్తున్నాయి. కాలానికి అనుగుణంగా సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి. ఇక చాలామంది తమ ఆరోగ్యం కోసం, హార్ట్ రీడింగ్స్ కోసం ప్రముఖ యాపిల్ బ్రాండ్ స్మార్ట్ వాచ్‌లు వినియోగిస్తుంటారు. యాపిల్ వాచ్‌లలో ఉండే అడ్వాన్స్‌డ్ ఫీచర్లు చాలా మంది ప్రజల ప్రాణాలను కాపాడాయి. ఈ ఖరీదైన వాచ్ లు ధరించిన వారి ఆరోగ్య పరిస్థితిని కచ్చితంగా అంచనా వేస్తున్నాయి. వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తూ..సకాలంలో చికిత్స అందిలే చూస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే…
READ MORE: Hyderabad: కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి.. నిరాకరించడంతో దారుణ హత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కొద్ది కాలంగా ఆపిల్ వాచ్ ధరిస్తున్నారు. తాజాగా ఆయన ఆ వాచ్ చేసిన అలర్ట్ ద్వారా ముందస్తు గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇటీవల కాలంలో కొంతదూరం నడిస్తే ఆయాసం, ఛాతిలో మంటలా ఉన్నప్పటికీ పెద్దగా పట్టించు కోలేదు. గుండెకు సంబంధించిన ఇబ్బంది ఉన్న దని, తక్షణమే వైద్యుల సలహా తీసుకోవాలని ఆపిల్ వాచ్ సోమవారం అలర్ట్ చేసింది. అప్రమత్తమైన ఆయన వరంగల్ వైద్యులను సంప్రదించారు. పరీక్షించిన డాక్టర్లు గుండెకు సంబంధించిన రెండు రక్తనాళాలు మూసుకుపోయాయని విస్తుపోయే నిజాలు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. ఆయన వెంటనే అలర్ట్ అయ్యి.. హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్య సేవలు పొందారు. గత కొద్ది కాలంగా ఆయన వాడుతున్న ఆపిల్ వాచ్ ప్రాణాలను కాపాడింది.