నేడు ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను నేడు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ విడుదల చేయనుంది. ఈ పరీక్షలను జూన్ 2 నుంచి 10 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,12,221 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అలాగే http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లో కూడా విద్యార్థులు AP SSC Supplementary Results చెక్ చేసుకోవచ్చు. స్కూల్ లాగ్ ఇన్ లో సంబంధిత స్కూల్ మొత్తం ఫలితాలు ఉంటాయి.అలాగే ప్రతి విద్యార్థి తమ ఫలితాల యొక్క మార్కుల జాబితాను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానంద్ రెడ్డి తెలిపారు.
Also Read : Weight Loss food : ఉదయం ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిపోతుంది..
ఈసారి పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసారి టెన్త్ ఫలితాల్లో 75.38 శాతం మంది బాలికలు పాస్ కాగా, 69.27 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరగింది. ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది కంటే ఈసారి 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 87.4 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, నంద్యాల చివరి స్థానంలో ఉంది.
Also Read : BCCI Chief Selector: శాలరీ తక్కువని.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవిని వద్దనుకున్న భారత దిగ్గజం!