ఏపీలో ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల ఖరారు పూర్తయింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు అవకాశం ఇచ్చారు. బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
రాష్ట్రంనుంచి ఖాళీ అయిన నాలుగు స్థానాలకు అభ్యర్ధుల్ని ఫైనల్ చేశారు. నాలుగింట సగం స్థానాలు బలహీన వర్గాలకే ఇచ్చారని, ఈ స్థాయిలో బలహీన వర్గాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వటం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు మంత్రి బొత్స. ఈ స్థాయిలో బలహీన వర్గాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వటం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు.
తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అలాగే జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీద మస్తాన్‌రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. నిరంజన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. నిర్మల్ జిల్లా వాస్తవ్యుడు నిరంజన్ రెడ్డి. దిలవార్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది, పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, నిరంజన్ రెడ్డి వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు కావడంతో ఆయన బంధువులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Niranjan reddy: ప్రపంచ వ్యవసాయానికి నీటి ప్రాముఖ్యత తెలిపిన నేల ఓరుగల్లు