YS Sharmila: జమిలి ఎన్నికల బిల్లుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!
- జమిలి ఎన్నికల బిల్లుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
- భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉంది
- బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పూర్తి మెజార్టీ లేకపోయినా.. రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనం అని మండిపడ్డారు. అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
‘భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పూర్తి మెజార్టీ లేకపోయినా.. రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనం. ఇది ఫక్తు నియంతృత్వ చర్య .సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్‌సభలో ఓటింగ్‌తో తేలింది. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి?. ఇందులో ఏమన్నా అర్థముందా?, సభలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు మోడీ సర్కారు ప్రయత్నించింది. చివరకు ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టింది’ అని వైఎస్ షర్మిల ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
‘రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదు. జమిలి ఎన్నికలు జరపాలంటే.. కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణీత కాలవ్యవధి కల్పించే ఆర్టికల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుంది. అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. జమిలి ద్వారా దానికి గండికొట్టే అధికారం కేంద్రానికి లేదు. దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావడమే బీజేపీ ఉద్దేశం. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే జమిలి ఎన్నికల బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహకరించదు’ అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!