Tata Sierra: ధరల విషయంలో నిన్ను కొట్టేవాడు లేడు.. టాటా సియోర్రా ధర, బుకింగ్స్, డెలివరీ..
- రూ. 11.49 లక్షల నుంచే టాటా సియెర్రా ధరలు..
- అత్యాధునిక ఫీచర్లుతో వస్తోన్న సియెర్రా..
- బుకింగ్స్, డెలివరీల వివరాలను వెల్లడించిన టాటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Sierra: టాటా తన ఐకానిక్ సియెర్రాను(Tata Sierra) రంగ ప్రవేశం చేయించింది. ఆకట్టుకునే డిజైన్, మెరుగైన ఫీచర్లతో ప్రత్యర్థి కార్ మేకర్స్‌కి ఛాలెంజ్ విసురుతోంది. తక్కువ ధరలతో, ఎక్కువ ఫీచర్లు అందించే టాటా మరోసారి అదే చేసి చూపించింది. మిడ్ సైన్ SUV ధరల్ని టాటా మోటార్స్ వెల్లడించింది. సియెర్రా తబేస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్ షోరూం ధరను రూ. 11.49 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. బుకింగ్స్ డిసెంబర్ 16, 2025న అధికారికంగా ప్రారంభించింది. డెలివరీలను జనవరి 15, 2026 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పింది.
ఫీచర్లు:
Also Read
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
టాటా తన ట్రేడ్ మార్క్ డాక్సీ సిల్హౌట్ డిజైన్‌తో సియెర్రాను తీసుకువస్తోంది. ఫ్లష్ ట్లేజింగ్, డాష్ బోర్డుపై 3- స్క్రీన్ డిస్‌ప్లేని అందిస్తోంది. తొలిసారిగా టాటా తన కార్లలో త్రీ స్క్రీన్ సెటప్‌ని ఇస్తోంది. పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను ఇస్తోంది. కనెక్టెడ్ LED DRLలు, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్ రూఫ్ రేయిల్స్ మరింత అట్రాక్టివ్‌గా కనిపించబోతున్నాయి. వెంటిలేటెడ్ సీట్స్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, టూ స్టేజ్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, ఎక్స్‌ప్రెస్ కూలింగ్‌తో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎంపిక చేసిన వేరియంట్‌లలో ప్యాడిల్ షిఫ్టర్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 14 వ్యూస్‌తో 360-డిగ్రీల కెమెరా, రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. 12- స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ మరో ప్రత్యేకత.
ఇంజన్ ఆప్షన్స్:
టాటా సియోర్రా పెట్రోల్, డిజిల్ వేరియంట్లలో వస్తోంది. కొత్తగా 1.5 లీటర్ TGDi హైపెరియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను తీసుకువస్తోంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 160 bhp పవర్, 255 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్‌తో కూడా అందుబాటులో ఉంది, ఇది 106 bhp, 145 Nm పవర్ కలిగి ఉంటుంది.
డిజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ కైరోజెట్ ఇంజన్ ఉంటుంది. ఇది మన్యూవల్ గేర్ బాక్స్‌తో ఇది 118 bhp, 260 Nm పవర్‌ను ఇస్తుంది. ఆటోమేటిక్ 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే కాకుండా ఆల్ టర్రైన్ సామర్థ్యం కోసం ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్‌ను త్వరలోనే సియెర్రా లైనప్‌లో చేర్చుతామని టాటా చెబుతోంది. సియోర్రా అధునాతన లెవల్-2 ADASను కలిగి ఉంటోంది.
తాజావార్తలు
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్‌ఫోన్‌లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!