CM Chandrababu: జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నెల నవంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ నోటిఫికేషన్‌పై నెల రోజులపాటు అభ్యంతరాలను స్వీకరించిన ప్రభుత్వం, నిర్దేశించిన గడువును నేటితో ముగించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927…
AP New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు.…
AP New Districts: అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర జిల్లాల పునర్విభజనపై కీలక మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమనే దృక్కోణంలో జరిగిన ఈ సమావేశం ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్‌ల పునర్విభజనపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు అనగాని సత్య ప్రసాద్, పొంగూరు నారాయణ, బిజి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. వర్చువల్ ద్వారా…
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు మార్పుల చేర్పుల కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి అధ్యాయనం కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.