ఇటీవల ఏపీలో ఎంతో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్సీ ఎన్నికల గెలిచిన అభ్యర్థులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే.. ఇవాళ కొత్తగా ఎన్నికైన పది మంది వైసీపీ ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్తగా ఆరుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు, ఇద్దరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. అయితే.. వీరు. ఉదయం 10.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Also Read : Twitter Legacy: బ్లూ చెక్‌లను తొలగించేందుకు సిద్ధం.. డేట్ సెట్ చేసిన ఎలోన్ మస్క్
ప్రమాణం చేయనున్న వారిలో.. సూర్యనారాయణ రాజు. మర్రి రాజశేఖర్. జయమంగళ వెంకట రమణ. యేసు రత్నం. బొమ్మి ఇజ్రాయిల్. పోతుల సునీత. ఎం.వి. రామచంద్రారెడ్డి. పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి. పొన్నంరెడ్డి రామ సుబ్బారెడ్డి. ఎస్. మంగమ్మ లు ఉన్నారు. అయితే.. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
Also Read : Mahaboobnagar Crime: ఆసుపత్రికి క్యూ కడుతున్న కల్తీ కల్లు భాదితులు.. ఇద్దరు మృతి