Mahaboobnagar Crime: మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పది మంది అస్వస్థతకు గురి కావడం కలకలం రేపుతుంది. కల్తీకల్లు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. జిల్లా ఆసుపత్రికి కల్తీ కల్లు భాదితులు ఇంకా క్యూ కడుతూనే వున్నారు. ఇది జరిగిరి సుమారు 6 రోజులు గడుస్తున్న బాధితులకు ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. అస్వత్తతో సుమారు 40 మంది బాధితులు ఆసుపత్తిలో చేరగా అందులో చికిత్స పొందుతూ సోమవారం ఒకరు మృతి చెందగా.. బుధవారం తెల్లవారుజామున మరో వ్యక్తి మరణించాడు. దీంతో జిల్లా లో తీవ్ర విషాదం నెలకొంది. కోడూరు కు చెందిన అంజయ్య, అంబేద్కర్ నగర్ కు చెందిన విష్ణు మృతులుగా గుర్తించారు. అయితే మృతులు కుటుంబ సభ్యుల నుంచి కల్లు కంపౌండ్ నిర్వాహకులు అగ్రిమెంట్ బాండ్ రాసుకున్నట్లు సమాచారం. మరికొందరు బాధితులు ఐ.సి.యూ లో చికిత్స పొందుతుండగా.. బాధితుల వివరాలను, మృతుల వివరాలు గోప్యంగా ఉంచుతున్న ఆసుపత్రి సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. బాధితుల వివరాలు చెప్ప వద్దంటూ, ఆస్పత్రి సిబ్బంది పై ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
Read also: Harish Rao: మే 1న సీఎం నోట మరిన్ని శుభవార్తలు వింటారు.. ఉత్కంఠగా మంత్రి మాటలు
బోయపల్లి కేంద్రంగా క్లోరల్ హైడ్రేట్, అల్ప్రాజోలం, అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతస్థాయి అధికారి కనుసన్నల్లోనే అమ్మకాలు నిర్వహించడం సంచలనంగా మారింది. 40 మంది కి పైనే కల్తీకల్లు బాధితులు ఉండటం గమనార్హం. భాదితులు ఆస్పత్రికి ఎక్సైజ్ అధికారులు కట్టడి చేసారు. కల్తీ కల్లు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినా కానీ.. దీనిపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో పలు అనుమాలు వ్యక్తం మవుతున్నాయి. బాధితులు శుక్రవారం ఆసుపత్రికి వచ్చినప్పటికీ అధికారులు, ఆసుపత్రి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
KTR Tweet: సవాల్ విసిరినా కానీ.. సైటెంట్ గా వున్నారు..