Narayana: నారాయణ కుమార్తెల ముందస్తు బెయిల్ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సంచలనం కలిగించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మాజీ మంత్రి పి. నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌తోపాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరికి హైకోర్టులో ఊరట లభించింది. తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపారు. పిటిషనర్లపై ఈ నెల 18వ తేదీ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్వర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణను మే 18వ తేదీకి వాయిదా వేశారు. దీంతో నారాయణ కుటుంబ సభ్యులు, విద్యాసంస్థల సిబ్బందికి ఊరట లభించినట్టయింది.
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు డీఈవో ఫిర్యాదు మేరకు చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో ఉన్న నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. తనకు ఈ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని నారాయణ తరఫు న్యాయవాది వాదించారు. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవి నుంచి నారాయణ 2014లోనే తప్పుకున్నట్టు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు చూపించడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్‌పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
ఈ కేసులో పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన నారాయణ కుటుంబ సభ్యులతోపాటు విద్యాసంస్థలకు చెందిన జాలిపర్తి కొండలరావు, మాలెంపాటి కిశోర్, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్ ప్రసాద్, వి.శ్రీనాథ్, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌కుమార్, జి.సురేశ్‌కుమార్, ఎ.మునిశంకర్, బి.కోటేశ్వరరావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమకు మాల్‌ప్రాక్టీస్‌తో సంబంధం లేదని, పోలీసులు నమోదు చేసిన కేసులో తమను నిందితులుగా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులకు దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, కాబట్టి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వారి తరపు న్యాయవాది అభ్యర్థించారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం పిటిషనర్లు అసలు నిందితులే కానప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే నష్టం ఏమిటని ప్రశ్నించింది. ఈ నెల 18 (బుధవారం) వరకు పిటిషనర్లపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ మన్మథరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు మే 18 తర్వాత ఏం మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!