CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్ఎస్కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోడౌన్లలోని బియ్యం నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని, ఉల్లి కొనుగోళ్లతో పాటు భవిష్యత్తు డిమాండ్‌కు తగినట్లు సాగును ప్రోత్సహించాలని సూచించారు. స్వయం సహాయక బృందాల ద్వారా కిచెన్ గార్డెన్లను వ్యవస్థీకృతం చేసి కూరగాయల ధరలను నియంత్రించవచ్చని తెలిపారు.
Also Read
రాష్ట్రవ్యాప్తంగా 50.7 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా ప్రకాశం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని సీఎం వెల్లడించారు. ఖరీఫ్‌లో 30.84 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా, ఎల్ నినో కారణంగా 79 శాతం భూముల్లోనే పనులు ప్రారంభమయ్యాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే రూ. 60 కోట్లతో కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేశామని, 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీతో అందించామని తెలిపారు.
వర్షాధార పంటలు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు రూ. 190 కోట్లు కేటాయించామని, ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా, పశువులకు నీరు, తగినంత పశుగ్రాసం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హంద్రీ-నీవా ద్వారా చివరి భూములకు, తాగునీటికి ఇబ్బంది లేకుండా నీటిని అందిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. విపత్తు సమయాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఎల్ నినో సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు