తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది.. ఇకపై 100 మార్కుల పేపర్ ఉండనుంది. ఇంటర్నల్ మార్కులను ఎత్తేసింది విద్యాశాఖ. ఇప్పటి వరకూ 80 మార్కులకే పేపర్ ఉండేది.. 20 మార్కులతో ఇంటర్నల్ ఎగ్జామ్ ఉండేది. కాగా.. ఆ పద్ధతిని విద్యాశాఖ ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ.
AP- TS 10th Class Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాల అదనపు గ్రేస్ టైమ్ ఇచ్చారు.
TS Tenth Exams 2024: పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాసే సమయం రానే వచ్చింది. రేపటి నుంచి టెన్త్ విద్యార్థులకు పరీక్షలు షురూ కానున్నాయి. అయితే విద్యార్థులు అధికారులు ఇచ్చిన గైడ్ లైన్స్ అనుసరించాలని సూచిస్తున్నారు.
TS 10th Class Exam: తెలంగాణ సర్కార్ 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేసింది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్ ట్రైం ను ప్రకటించింది.
ఏపీలో సంచలనం కలిగించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మాజీ మంత్రి పి. నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌తోపాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరికి హైకోర్టులో ఊరట లభించింది. తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపారు.…
మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు ఏపీ సీఐడీ పోలీసులు. కొండాపూర్‌లో నారాయణను అదుపులోకి తీసుకున్నారు ఏపీ సీఐడీ అధికారులు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధముందన్న ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు ఏపీలో సంచలనం కలిగించాయి. ఇటీవల సీఎం జగన్ కూడా నారాయణ, చైతన్య సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పలు అంశాలపై ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉందని…