Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరంలో జరిగిన వైఎస్సార్సీపీ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ మారేవారి గురించి కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఒకరు వెళితే, వంద మంది కొత్త నాయకులు వస్తారని ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడిన నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరైతే ఆర్థిక లావాదేవీలు జరిపి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి దోపిడీకి అలవాటు పడతారో, అలాంటి దోపిడీదారులే పార్టీని వీడి వెళ్లారని మండిపడ్డారు. పార్టీలో నిజాయితీగా ఉండే గౌరవప్రదమైన వ్యక్తులు ఎవరూ వెళ్లిపోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి నేతల తీరు చూస్తుంటే ప్రజలకు, నాయకులకు బీపీ పెరిగిపోతుందని ఎద్దేవా చేశారు. కూటమి నాయకుల తీరు అచ్చం ‘అలీబాబా 40 దొంగల’ కథలా ఉందని, వారంతా ఒక్కటై రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
రాబోయే కాలంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టాలని బొత్స సత్యనారాయణ పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. వార్డు సభ్యుల నుంచి మొదలుకొని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాల వరకు ప్రతి ఒక్కరూ పట్టుదలతో గెలవాలని సూచించారు. కార్యకర్తలు ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్నారు. ప్రతి వైఎస్సార్సీపీ నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!