తమ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లతో ప్రభుత్వం సంప్రదింపులకు దిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ కమిషనర్ కె.భాస్కర్, ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర లతో భేటీ అయ్యారు ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు. ఎన్ సిడిసి సర్వేను ఆశా వర్కర్లతో చేయించడం వల్ల పని భారం పెరిగిందని తక్షణమే నిలిపివేయాలని కోరారు ఆశా వర్కర్ల సంఘం.
గౌరవ వేతనం రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు పెంపు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు తదితర అంశాలపై మరోమారు ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీటిపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది ప్రభుత్వం. రంపచోడవరంలో అధిక ఇంజెక్షన్ డోస్ కారణంగా గర్భిణీ ఆశా వర్కర్ మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆశా వర్కర్లకు కొత్త ఫోన్ల పంపిణీ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ప్రభుత్వం.రాష్ట్రంలో ప్రతి అంగన్వాడీ వర్కర్ కు స్మార్ట్ ఫోన్ ఉండే విధంగా 56 వేల ఫోన్ లను కొనుగోలు చేస్తున్నాం అని ఇప్పటికే తెలిపారు మంత్రి తానేటి వనిత.