Infinix GT 30 5G+: ఇన్ఫినిక్స్ GT 30 5G+ నేడు (ఆగస్ట్ 8) మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. జూన్‌లో విడుదలైన ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G తరువాత కంపెనీ లైనప్‌లో చేరుతున్న తాజా స్మార్ట్‌ఫోన్ ఇది. లాంచ్‌కు ముందు, ట్రాన్షన్ హోల్డింగ్స్‌కి చెందిన ఈ బ్రాండ్ అనేక ఫీచర్లను టీజ్ చేస్తూ వచ్చింది. సైబర్ మెకా 2.0 డిజైన్‌తో పాటు రియర్ ప్యానెల్‌లో కస్టమైజ్ చేయగల మెకా లైట్స్, అలాగే ప్రో మోడల్‌లో లాగా కస్టమైజ్ చేయగల షోల్డర్ ట్రిగర్స్ ఇందులో ఉంటాయని ఇప్పటికే కంపెనీ ధృవీకరించింది.
Bigg Boss 19: డ్రామాక్రేజీ కాదు.. ‘డెమోక్రేజీ’ అంటున్న బిగ్ బాస్ హోస్ట్!
ఇన్ఫినిక్స్ GT 30 5G+ అధికారిక ధర ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇది GT 30 ప్రో 5G కంటే తక్కువ ధరలో రావచ్చని భావిస్తున్నారు. GT 30 ప్రో 5G ధర 8GB + 256GB వేరియంట్ రూ.24,999 నుంచి మొదలవుతుంది. కాబట్టి, GT 30 5G+ ధర రూ.20,000 లోపు ఉండే అవకాశముంది. అలాగే లాంచ్ తరువాత ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది. మరి ఈ ఇన్ఫినిక్స్ GT 30 5G+ లీకైన వివరాలను ఒకసారి చూసేద్దామా..
Visakha Land Scam: విశాఖ భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశాలు..
ఫీచర్లు & స్పెసిఫికేషన్స్ (అంచనా):
డిస్ప్లే: 1.5K 10-bit AMOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్.
డిజైన్: సైబర్ మెకా 2.0 డిజైన్, రియర్‌లో కస్టమైజ్ చేయగల మెకా లైట్స్ (Breath, Meteor, Rhythm మోడ్‌లు).
గేమింగ్: కస్టమైజ్ చేయగల షోల్డర్ ట్రిగర్స్ – గేమ్ కంట్రోల్స్, కెమెరా కంట్రోల్స్, క్విక్ యాప్ లాంచ్, వీడియో ప్లేబ్యాక్ వంటి మల్టీ ఫంక్షన్‌లకు సపోర్ట్.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (4nm), 16GB LPDDR5X RAM (వర్చువల్ ఎక్స్‌పాంశన్‌తో), 256GB స్టోరేజ్.
పర్ఫార్మెన్స్: AnTuTu స్కోర్ 7,79,000+, BGMIలో 90fps గేమింగ్ సపోర్ట్.
AI ఫీచర్లు: AI Call Assistant, AI Writing Assistant, Folax వాయిస్ అసిస్టెంట్, Google’s Circle to Search.
కెమెరా: వెనుక డ్యూయల్ కెమెరా – 64MP Sony IMX882 మెయిన్ సెన్సార్ + 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, ముందు 13MP సెల్ఫీ కెమెరా. ఫ్రంట్ & రియర్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్.