Boycott G Pay- Phone Pay: సోషల్ మీడియా వేదికగా “బాయ్‌కాట్ గూగుల్ పే, బాయ్‌కాట్ ఫోన్ పే” అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ రెండు ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తరువాత.. నెట్టింట యూఎస్ వ్యతిరేక నినాదాలు పెరిగిపోయాయి.
Read Also: Kantara Chapter1: కనకవతి వచ్చేసింది.. కాంతార నుండి రుక్మిణి బ్యూటి ఫుల్ లుక్
ఇక, అమెరికా ఉత్పత్తుల బహిష్కరణ ఉద్యమాలు సోషల్ మీడియా వేదికగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో #BoycottUSA, #BoycottGPay, #BoycottPhone Pay వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్ (ఎక్స్), ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. వినియోగదారుల ఫోరమ్‌లు, సామాజిక మాధ్యమాల కమ్యూనిటీ గ్రూపులు ఇప్పుడు స్థానికంగా తయారు చేసిన ప్రత్యామ్నాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనే డిమాండ్ పెరిగింది. అయితే, కొంతమంది యూజర్లు.. భారతదేశానికి చెందిన పేమెంట్ యాప్‌ల వైపు మొగ్గు చూపాలని పిలుపునిస్తున్నారు.
Starts Using Swadeshi Let Boycotts all Americans Companies producing products #BoycottGPayAndPhonePe #SwadeshiVsUSA pic.twitter.com/3KXQxmQPqK
— RAHUL SINGH (@RAHULKUMAR705) August 7, 2025