AP And Telangana Water War: జలం జగడం.. కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ.. ఆపే ప్రశ్నేలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP And Telangana Water War: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, జలం జగడంపై కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సాగర్ స్పిల్ వేలో సగభాగాన్ని ఏపీ స్వాధీనం చేసుకుందని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.. కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమారు రాష్ట్ర జలవనరుల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ లేఖను పంపించారు.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్‌ను నియంత్రించడంలో కృష్ణా బోర్డు వైఫల్యం చెందిందని లేఖలో ఆక్షేపించింది ఏపీ ప్రభుత్వం.. అందుకే మా భూభాగంలోని నాగార్జున సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం స్వాధీనం చేసుకున్నామని లేఖలో స్పష్టం చేసింది.
Read Also: IPL Auction 2023: ఐపీఎల్ వేలంలో 1166 మంది ప్లేయర్లు.. 77 ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీల ఆసక్తి
Also Read
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ఏపీకి కేటాయించిన నీటిని తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు విడుదల చేశామని లేఖలో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. సాగర్ కుడి కాలువ కింద మాకు కేటాయించిన 15 టీఎంసీల్లో ఇప్పటివరకు ఐదు టీఎంసీలు వాడుకున్నాం. మిగిలిన పది టీఎంసీలను వాడుకోనివ్వకుండా సాగర్‌ను తెలంగాణ ఖాళీ చేస్తే.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడం సవాల్‌గా మారుతుందని రాసుకొచ్చింది.. ఈ ఆందోళనతోనే సాగర్ స్పిల్ వే ను స్వాధీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేసి మా హక్కులను పరిరక్షించుకున్నాం.. నీటి విడుదలను ఆపే ప్రశ్నే లేదని కృష్ణా రివర్ బోర్డుకు రాసిన లేఖలో కుండబద్దలు కొట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..