ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, జలం జగడంపై కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.