ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, జలం జగడంపై కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి జల జగడం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారి ఈఎన్‌సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై లేఖలో అభ్యంతరం తెలిపారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని ఈ లేఖలో…
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ సర్కార్ మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి లేఖ రాసారు. కేఆర్ఎంబీ అనుమతీ లేకుండానే తెలంగాణ జెన్ కో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించటంపై ఏపీ మరోమారు అభ్యంతరం వ్యక్తం చేసింది. జూన్ 1 తేదీ నుంచే విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగం జరుగుతోందని లేఖలో వివరించిన అధికారులు… ఇప్పటికే 6.9 టీఎంసీల నీటిని వాడేశారని పేర్కొన్నారు…