ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, జలం జగడంపై కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
జల జగడం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వార్ నడుస్తూనే ఉంది… ఇప్పుడు, విమర్శలు, ఆరోపణల పర్వం కాస్త ఆగినట్టే కనిపిస్తున్నా.. లేఖలు, ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యాల్లో తేడాను సవరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. 1952లో ఆంధ్ర, హైదరబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్…