Municipal Strike: 12వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె.. మరోసారి చర్చలకు సర్కార్ ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Municipal Strike: తమ సమస్యలు పరిష్కారం కోరుతూ పారిశుద్ధ కార్మికులు చేపట్టిన సమ్మె ఆంధ్రప్రదేశ్‌లో 12వ రోజుకు చేరింది.. అయితే, సమ్మెకు పులిస్టాప్ పెట్టడానికి రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఇప్పటికే కార్మిక సంఘ నాయకుల డిమాండ్ల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిపినా అవి విఫలం అయ్యాయి.. నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్య కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా లేదంటే నేతలు మండిపడుతున్నారు.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలని.. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించింది ఏపీ వ్రభుత్వం.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వం – మున్సిపల్ కార్మికుల మధ్య చర్చలు జరగనున్నాయి.. మున్సిపల్ కార్మికులతో ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపారు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్.. సమాన పనికి సమాన వేతనం డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు. నేటితో 12వ రోజుకు చేరింది మున్సిపల్ కార్మికుల సమ్మె. సమ్మెలో భాగంగా ఇవాళ మున్సిపల్ కార్యాలయాల ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో.. ఇవాళ్టి చర్చల్లోనైనా.. ప్రభుత్వం-కార్మిక సంఘాల మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతాయా? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!