రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు.
రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. 18 నుంచి 25 లోపు నామినేషన్లు తీసుకోవడం జరుగుతుందని.. రేపు సెక్షన్ 30, 31 నోటీసు ఇస్తామన్నారు. ఫారం - 1 పబ్లిక్ నోటీసుపై రిటర్నింగ్ అధికారి సంతకం చేస్తారని.. రేపు ఉదయం 11 గంటల నుంచీ నామినేషన్లు స్వీకరించడానికి సంసిద్ధం చేసుకుంటారన్నారు.
మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విలన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తరువాత హీరోగా మారి వరుస సినిమాలు చేసి వరుస హిట్స్ కూడా అందుకున్నాడు.. అయితే ప్రస్తుతం గోపీచంద్ కెరీర్ పరిస్దితి అంత గొప్పగా ఏమి లేదు.. ఆయన చేసిన ప్రతి సినిమా వచ్చింది వచ్చినట్లుగానే వెళ్ళిపోతుంది..ప్రస్తుతం గోపీచంద్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు.సూపర్ హిట్ సినిమా అందించి మరోసారి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు..గోపీచంద్…
ఎమ్మెల్యే లాస్య మృతిపై కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ తెలిపారు. ఉదయం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని.. డ్రైవర్ ఆకాష్ అకస్మాత్తుగా నిద్రమత్తులోకి జారడం వల్ల డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయాడని వెల్లడించారు.
పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటం దాదాపు ఖాయమైంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ - పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రతిపక్షంలో కూర్చోనుంది. పాలక కూటమిలో నవాజ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. నేడు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. పలు శాఖలకు సంబంధించిన అన్యువల్ రిపోర్ట్స్‌ను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం .. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
ఏపీలో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ పార్టీ.. వై నాట్ 175.. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల నినాదం ఇదే.. ఎవరెవరు కలిసినా.. ఎంత మంది తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా.. తనదే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో.. ప్రజాప్రతినిధులను, నేతలను, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు సీఎం జగన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
వీఆర్ఏలకు డీఏను రూ.300 నుంచి 500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి వెల్లడించారు. డీఎను పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
2024లో వచ్చేది జనసేన - టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ లాగా డబ్బు పేరుకుపోయి ఉన్న నేతను ఎలా అడ్డుకోవాలో తనకు తెలుసన్నారు. తమకు నైతికంగా బలం ఉంది కాబట్టే.. నేనింత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే వాడిని అయ్యామన్నారు. తాను ప్యాకేజ్ తీసుకున్నానని ఆరోపిస్తున్నారని.. తనకు డబ్బంటే ప్రేమ లేదని వాళ్లకెలా చెప్పనంటూ పేర్కొన్నారు.
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లారు. ప్రధాని మోదీ తన ఫ్రాన్స్ పర్యటనను "చిరస్మరణీయమైనది" అని అభివర్ణించారు.