తెలుగు రాష్ట్రాలు రెండుగా ఏర్పడిన తర్వాత కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఏర్పడింది. దీనికి తోరం రాజా అధ్యక్షులు కాగా, స్వామి ప్రధాన కార్యదర్శి. గురువారం వీరిద్దరూ తమ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో కార్యదర్శి కె. ఎల్. దామోదర ప్రసాద్ ను; నిర్మాత మండలి కార్యదర్శి వడ్లపట్ల మోహన్ ను; ‘మా’ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మాణిక్, హరనాథ్ రెడ్డిలను కలిశారు.
ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ లో కూడా 24 క్రాఫ్ట్స్ కు సంబంధించి సుశిక్షుతులైన సాంకేతిక నిపుణులు ఉన్నారని, వారికి అవకాశం కల్పించి, ఫెడరేషన్ అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులతో పాటు సభ్యులు రాపా ధనుంజయ, ముత్తుకూరు నరసింహులు, చవల మురళీకృష్ణ, జయకుమార్, రంగస్థలం లక్ష్మీ, సిద్ధి సుజాత, కంప్లి సుజాత, కాకర్ల శ్రీను, గణేష్, హైమావతి, అశోక్ లాహరి తదితరులు పాల్గోన్నారు.