Pawan Kalyan son Mark Shankar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు.. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలు అయ్యాయి.. సింగపూర్‌లో స్కూల్లో మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదంలో.. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి.. ఇక, ఈ ప్రమాద సమయంలో.. పెద్ద ఎత్తున పొగ, మంటలు సంభవించడంతో.. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడట మార్క్ శంకర్.. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం సింగపూర్‌లోని ఆస్పత్రిలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చికిత్స పొందుతున్నాడు..
Read Also: Jaipur: జైపూర్‌లో కారు బీభత్సం.. ఇద్దరు మృతి.. 9 మందికి గాయాలు
ప్రస్తుతం మన్యం పర్యటనలో ఉన్నారు పవన్ కల్యాణ్.. మన్యంలో పర్యటన ముగిసిన తరవాత సింగపూర్ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు.. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని.. కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.. ఇక, ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ విశాఖ చేరుకుంటారని.. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..