Deputy CM Pawan Kalyan: కొండగట్టు, పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్.. షెడ్యూల్ ఖరారు..
- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కొండగట్టు
- పిఠాపురం పర్యటన ఖరారు..
- ఈ నెల 29వ తేదీన కొండగట్టుకు పవన్.. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న పవన్..
- జులై 1వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురం పర్యటన..
- మూడు రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు కార్యక్రమాలకు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కొండగట్టు, పిఠాపురం పర్యటన ఖరారు అయ్యింది.. ఈ నెల 29వ తేదీన కొండగట్టుకు వెళ్లనున్నారు పవన్.. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి.. స్వామివారిని దర్శించుకొని పూజాదికాలు నిర్వహిస్తారు. ఇక, జులై 1వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు.. 1వ తేదీ నుంచి తన పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తారు. మూడు రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు.. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Read Also: Kenya Parliament: హింసాత్మకంగా మారిన నిరసనలు.. కాల్పుల్లో 10 మంది మృతి
Also Read
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గానికి వస్తున్నారు పవన్ కల్యాణ్.. స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది.. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచిన పవన్ కల్యాణ్.. మంత్రివర్గ కూర్పులో భాగంగా పవన్ కల్యాణ్‌కు ఏపీ ఉపముఖ్యమంత్రిగా ప్రత్యేక గౌరవం దక్కింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను సీఎం చంద్రబాబు కేటాయించారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వచ్చేవారం పిఠాపురంలో పర్యటించనున్నారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుసుకొని నియోజక వర్గంలో పర్యటించబోతున్నారు.
తాజావార్తలు
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!