Extramarital Affair: దారుణం.. ఆపనికి అడ్డుగా ఉందని కూతుర్ని హత్య చేసిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affair: తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. చిన్నపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎలాంటి లోటు లేకుండా అల్లారముద్దుగా పెంచుకుంటారు. తమ కోరికలు, ఇష్టాలను చంపుకొని మరీ.. పిల్లల అలనాపాలనా చూసుకుంటారు. కానీ.. ఓ తల్లి మాత్రం అందుకు భిన్నంగా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే నీచానికి పాల్పడింది. కేవలం ‘కామలీలల’ కోసం కన్నకూతురినే తన చేతులతో చంపింది. ఆపై.. తాను చేసిన దారుణాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, సరికొత్త డ్రామాకు తెరతీసి, తనకేమీ తెలియదన్నట్టుగా ‘మహానటి’ని మించి నటించింది. చివరికి తాను చేసిన పాపానికి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.
Read also: Heavy Rains: విషాదాన్ని మిగులుస్తున్న వర్షాలు.. దేశవ్యాప్తంగా 100 మందికి పైగా మృతి
Also Read
కుషాయిగూడలో చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో సంచలనం వెలుగులోకి వచ్చింది. బాలికను తల్లి కల్యాణే హత్య చేసినట్లు తేలింది. తండ్రి అనుమానం నిజమైంది. నిందితురాలికి ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని, దానిని తన కూతురు అడ్డుకోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న నాలుగున్నరేళ్ల బాలికను దిండుతో కప్పి ఊపిరాడకుండా చేసి తన్విత హత్య చేసింది. పోలీసుల విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. ఈ నెల 1వ తేదీ (శనివారం) మధ్యాహ్నం తన్విత స్కూల్ నుంచి వచ్చి భోజనం చేసి కాసేపు ఆడుకుని పడుకుంది. కూరగాయల మార్కెట్‌లో పనిచేసే తల్లి కళ్యాణి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కూతురు నిద్రిస్తోంది. ఫోన్ చేసినా నిద్ర లేవకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నిద్రిస్తున్న కూతురు నిద్రలోనే మృతి చెందిందని కల్యాణి కన్నీరుమున్నీరైంది. ఆమె తన పొరుగువారిని, బంధువులను తెలిపింది. అయితే కూతురు మృతి పట్ల భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ భర్త రమేష్ జూలై 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Read also: Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ చోరీ.. రూ.5 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లిన నేపాలి గ్యాంగ్
ఊపిరాడక చిన్నారి మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు చిన్నారి తల్లి కళ్యాణిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన కూతురిని తానే హత్య చేసినట్లు అంగీకరించింది. కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ మార్కెట్ వెనుక వీధిలో నివాసముంటున్న నాయిక్‌వాడి రమేష్ కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కల్యాణి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు తన్విత (4 సంవత్సరాల 6 నెలలు) అనే కుమార్తె ఉంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2021 నుంచి విడివిడిగా ఉంటున్నారు.కళ్యాణి కూతురిని తీసుకుని కుషాయిగూడలోని తల్లిదండ్రుల ఇంటి సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. పాప స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. భర్త నుంచి విడిపోయిన కళ్యాణికి స్థానికంగా ఉన్న మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. పాప అడ్డుగా ఉందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టింది. చిన్నారిని ఊపిరాడకుండా చేసి, నిద్రలోనే చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. పాలివ్వాల్సిన తల్లి నిద్రపోతే చంపేస్తుందని ఆ చిన్నారి ఎలా ఊహించగలదు.
Asia Cup 2023 Schedule: ఆసియా కప్‌కు బీసీసీఐ, పీసీబీ గ్రీన్ సిగ్నల్.. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్!
తాజావార్తలు
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్‌లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!